| Title | మీ చిన్నారులకు ముచ్చటైన పేర్లు |
| Author | జుల సత్యనారాయణ |
| Rate | |
| Pages | 139 |
| About PDF | ఈ పుస్తకంలో మీ ముద్దులొలికే చిన్నారులకు అద్భుతమైన పేర్లు ఇవ్వబడ్డాయి. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా పేర్లు ఇవ్వడినవి. అంతేకాక ఈ పేర్లు అక్షరక్రమంలో ఇవ్వబడ్డాయి. సాంప్రదాయ సిద్ధమైన పేర్లతోపాటు, అత్యంత ఆధునిక పేర్లు, దేశ, అంతర్జాతీయ పేర్లను దృష్టిలో పెట్టుకొని ఈ పేర్ల రూపకల్పన చేయటం జరిగింది. ప్రతి పేరుకు ముందుగాని వెనుకగాని మీకు అనుగుణంగా పేర్లను (నాయుడు, రెడ్డి, చౌదరి ... ఇలా) కూడా చేర్చుకొనవచ్చును. అదే కొన్ని స్త్రీ నామమునకు ముందుగాని వెనుకగాని 'శ్రీ'ను కూడా చేర్చవచ్చును. ఉదాహరణకు 'జయ' అనే పేరుకు ముందు శ్రీ చేర్చి శ్రీ జయ అని, తరువాత శ్రీ చేర్చి జయశ్రీ అని కూడా మీ పిల్లలకు పేర్లు పెట్టుకొనవచ్చును. ఈ పుస్తకంలో మీ పిల్లలకు పేర్లు నిర్ణయించుకొనుటకు విస్తృతమైన పేర్ల జాబితాను ఇవ్వటం జరిగింది. ఇందువలన మీరు మీ పిల్లలకు అరుదైన, మీకు నచ్చిన పేర్లు పెట్టుకొనుటకు అవకాశం ఏర్పడుతుంది. ఇంతే కాకుండా ఇందులో చిన్నారులకు సంబంధించిన మరికొన్ని జాతక, జ్యోతిష వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. జన్మ, నామ నక్షత్ర, రాశి, గణ చక్రము; జనన నక్షత్ర దోషాలు, వాటి పరిహారాలు; గండ నక్షత్ర జాతకులు జరిపించవలసిన తొమ్మిది రకాల శాంతులు వాటి వివరాలు; శాంతి చేయించుకొనవలసిన నక్షత్రాల జాబితా మొదలైన విషయాలతో పాటు; పురుడు తరువాత శిశువుతో అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళాలి?, బిడ్డను ఎప్పుడు ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళాలి?, బిడ్డకు మొలత్రాడు ఎప్పుడు కట్టాలి? మొదలైన వాటికి సంబంధించిన తిథులు, నక్షత్రాలు; జన్మసమయ నిర్ణయం ఎలా జరుగుతుంది?, ఏది సరియైన పద్ధతి?... మొదలైన విషయాలతో పాటు ఇంగ్లీషు పద్ధతి ప్రకారం నామనక్షత్రం - రాశుల వివరాలు కూడా పొందుపర్చబడ్డాయి. ఇంతేకాక ఆరోగ్య విషయంగా బిడ్డ పుట్టినప్పటి నుండి 10 సంవత్సరం వచ్చే వరకు పిల్లలు ఉండవలసిన ఎత్తు, బరువు మొదలైన వివరాలు కూడా పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి. మీరు మీ పిల్లలకు ఏ పేర్లు పెట్టినా ముద్దు పేరుతో పిలుస్తారు కదా? అందుకొరకు కొన్ని ముద్దు పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. అందులోనుంచి మీరు మీ అందమైన బిడ్డకు ముద్దు పేరును నిర్ణయించుకోవచ్చు. మీరు మీ పిల్లల పేర్లు నిర్ణయించుకొనేటప్పుడు లేదా మీ స్నేహితులు, బంధువుల పిల్లల పేర్లు నిర్ణయించుకొనేటప్పుడు ఈ పుస్తకం మీకు ఎంతగానో సహాయకారి కాగలదు. |
| Language | Telugu |
| Any Queries Contact | feedback@nithra.mobi |
₹ 30
₹ 100 (70%)
₹
30 ₹
100 (70%)
© 2026 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved