| Title | విష్ణు పురాణం |
| Rate | |
| About PDF | చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది. ముందుగా విష్ణుమూర్తిని సర్వాంతర్యామిగా కీర్తించి తరువాత అతడి నుండి ప్రపంచం ఉద్భవించిన తీరు చెప్పబడింది. విరాట్పురుషుడి నుండి అవ్యక్తము దాని నుండి ఆత్మ, దాని నుండి బుద్ధి, దాని నుండి మనసు దాని నుండి ఆకాశం దాని నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దాని నుండి జలము దాని నుండి హిరణ్మయమైన అండము (భూమి) ఉద్భవించాయని చెప్పబడింది. తరువాత తనకు తానుగా శరీరమును గ్రహించి ముందుగా రజోగుణ సంపన్నుడై బ్రహ్మగా జగత్తు సృష్టి చేయబడింది. దేవ దానవులు మానవులు, సప్త సముద్రాలు, సప్త ద్వీపములు సృష్టించి సత్వగుణ ప్రధానుడై లక్ష్మితో పాల సముద్రం మీద ఆది శేషుని మీద కొలువుండి లోక పాలన చేయసాగాడు. ముందుగా వరాహా మూర్తి అయి భూమిని ఉద్ధరించి యోగ నిద్రలో లోకములోని ప్రాణుల కర్మలను దివ్య దృష్టితో అవలోకిస్తున్నాడని చెప్పబడింది. తరువాత తమోగుణ సంపన్నుడై హరుడై ఈ లోకములను ఈ లోకములోని సంహార క్రియ చేపట్టాడు. తరువాత భూమి ఉద్ధరించిన యజ్ఞ వరాహ మూర్తి వర్ణన జరిగింది. అతడి నాలుగు పాదములు నాలుగు వేదములు, కోరలు ఊపష్తంభములు, నాలుగు ముఖములు బ్రహ్మ నాలుగు శీస్సులు, నాలుక అగ్నిదేవుడు, నేత్రములు రాత్రి పగలు, రోమములు ధర్భలు, ఆజ్యము ముక్కు, తోడము స్రువం, ధ్వని సామ ఘోష, స్వేదం సత్య తేజస్సు, కర్మ విక్రమము, లింగము హోమము, ఫలబీజములు ఓషధులు, అంతరాత్మ వాయువులు, స్థులు మంత్రములు, రక్తం సోమము, మూపులు వేదములు, హవిస్సు గంధం, ఇష్టి ఆయన తళుకులు ఇలా ఆయన శరీరం యజ్ఞా దీక్షా సహితంగా వర్ణించ బడింది. తర్వాత కొలమాన వర్ణన చేయబడింది. సూర్యుడు కిటికీ నుండి ప్రసరించే వెలుగులో కనిపించే పరాగ రేణువు త్రసరేణువు. ఇది మొదటి కాల గణన. 8 త్రస రేణువులు ఒక లిక్ష, 3 లిక్షలు ఒక రాజసర్షం, మూడు రాజసర్షలు ఒక గౌర సర్షం, ఆరు గౌర సర్షలు ఒక యవ, ఎనిమిది యవలు ఒక అంగుళం, పన్నెండు అంగుళములు ఒక శంకువు (అడుగు), రెండు శంకులు ఒక హస్తం (మూర), నాలుగు హస్తములు ఒక ధనస్సు, వేయి ధనస్సులు ఒక క్రోసు, రెండు క్రోశములు ఒక గవ్యూతి, నాలుగు గవ్యూతులు ఒక ఒక యోజనము, ఎనిమిది వందల వేల గవ్యూతులు ఒక శేషస్థానం ఉంది. తరువాత పాతాళ, రుద్ర, సుతల, గభస్తితలం, మహాతలం, భీమ తలం మొదలైన పాతాళాల వర్ణ అక్కడ నివసించే వారి వర్ణన జరిగింది. తరువాత పైలోకాల వర్ణ జరిగింది. మానవులు నివసించే భూలోకము, దేవతలు ఉండే భువర్లోకం, గోలోకమైన మహార్లోకం, బ్రహ్మ రార్తి సమయంలో అక్కడ జీవులు ఉంటారు. మహాత్ములుండే తపో లోకం, బ్రహ్మ నివసించే సత్య లోకం మొదలైన ఊర్ధ్వ లోకాల వర్ణనలు జరిగింది. తరువాత మేరు పర్వతం, లవణ సముద్రం చేత ఆవరించబడిన జంబూద్వీపం, పాల సముద్రం చేత ఆవరింప బడిన శాకాద్వీపం, నేతి సముద్రంతో ఆవరింప బడిన కుశ ద్వీపం, మీగడ సముద్రంతో ఆవరింప బడిన క్రౌంచ ద్వీపం, సురా సముద్రంతో ఆవరింపబడిన శాల్మల ద్వీపం, దానిని ఆవరించిన గోమేధం ఉంది.పుష్కర ద్వీపము నడుమన మానసోత్తర పర్వతం ఉంది. మేరువుకు అది తూర్పున ఉంది. ఆగ్నేయమున అగ్ని రాజధాని ప్రభావతీ నగరం, దక్షిణమున సంయమనీపురం, నైరుతి మూల విరూపాక్షుని విక్రాంత పురం ఉన్నది, పడమట వరుణ రాజధాని సుఖప్రభ, వాయవ్య మూల వాయవ్య రాజధాని శివ, ఉత్తరమున సోముని రాజధాని విభావరి, ఈశాన్యమున శివుని పురి శర్మదాపురి ఉంది. పుష్కర ద్వీపం, స్వర్ణద్వీపం, లోకాలోక వర్ణన, గర్భోదక సముద్రం దాని అందు నివసించు వారి వర్ణన జరిగింది. మేరువుకు తూర్పున ఉప్పుసముద్రం నడుమ జలములో విష్ణుతేజస్సుతో వెలిగే విష్ణులోకం ఉంది. మేరువుకు తూర్పున ఉన్న క్షీరాబ్ధి మధ్యలో విశ్హ్ణువు లక్ష్మీ సమేతుడై ఉండి హస్తదర్శనం మాత్రమే ఇస్తాడు. మేరువుకు తూర్పున పాలకడలి నడుమ శ్వేతద్వీపమందు విష్ణువు శిరస్సు చేత పంచకాల పూజలు అందుకుంటాడు. శ్వేతద్వీపమున ప్రవేశించిన జీవులు తరువాత ఆదిత్యమండలము ద్వారా బ్రహ్మలో ప్రవేశించి అనిరుద్ధుని, సంకర్షుని పొంది చివరకు వాసుదేవుడిని పొంది ముక్తులౌతారని చెప్పబడింది. క్షీర సముద్ర ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాది మునులు, శరీరధారులైన శాస్త్రములు, లక్ష్మాది దేవతల చేత కొలువబడుతూ ఉంటాడు. అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు ఉచ్వాస నిస్వాసలలో జీవుల పుట్టుక మరణం సంభవిస్తుంది.మేరువుకు పడమట ఘృత సముద్రముకు నడుమ ఉన్న గోవర్ధన గిరిలో దివ్యధేనువులు ఉంటాయి. అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తుంటాడు. దధిసముద్రం నడుమ మహాతేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణ రూపుడై ప్రకాశిస్తుంటాడు. సురాసముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర, కరీషిణి, కాంతి అను ముగ్గురు దేవతలు పరమసౌందర్యవతులై సేవిస్తుంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు.అందరు సులభంగా చదవగలిగే విధంగా 136 పేజీల pdf రూపంలో అందిస్తున్నాము. |
| Language | తెలుగు |
| ఫార్మేట్ | |
| Pages | 130 |
₹ 39
₹ 150 (74%)
₹
39 ₹
150 (74%)
© 2026 Nithra Edu Solutions India Pvt Ltd. All rights reserved